జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2020-07-14T16:01:46+05:30 IST

నెల్లూరు: కావలిలో జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధమైంది. అధికారులు ప్రతిపాధించిన లే అవుట్ కాదని,

జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధం!

నెల్లూరు: కావలిలో జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధమైంది. అధికారులు ప్రతిపాధించిన లే అవుట్ కాదని, స్థానిక ఎమ్మెల్యే మరో లే అవుట్ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అందులో ఎమ్మెల్యే బంధువులు, నేతల భూములు ఉన్నట్టు సమాచారం. గుంటలు.. మిట్టలుగా ఉన్న ఆ భూములని యంత్రాలతో చదును చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వంపై రూ.30కోట్లకి పైగా అధనపు భారం పడనుందని తెలుస్తోంది. జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రితో కలిసి అధికారులపై తీవ్ర వత్తిడి తెచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు సెలవుపై వెళ్లారు. 

Updated Date - 2020-07-14T16:01:46+05:30 IST