పింఛన్ల పెంపుపై మాట తప్పిన జగన్‌: కళా

ABN , First Publish Date - 2020-03-02T09:07:22+05:30 IST

వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లపై పచ్చి అబద్ధాలు చెప్తూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారానికి తెగపడడం సిగ్గు చేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు...

పింఛన్ల పెంపుపై మాట తప్పిన జగన్‌: కళా

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లపై పచ్చి అబద్ధాలు చెప్తూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారానికి తెగపడడం సిగ్గు చేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు.  పింఛన్లపై పత్రికల్లో ఇచ్చిన తప్పుడు ప్రకటనలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో అధికారులను హెచ్చరించారు.   వైసీపీ ప్రభుత్వం వచ్చాక, 7 లక్షల పింఛన్లు తొలగించి వారి ఉసురు పోసుకున్నారని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-03-02T09:07:22+05:30 IST