మత్తులో సంతకాలు.. తలుచుకొంటే బాధేస్తోంది: బుద్దా

ABN , First Publish Date - 2020-04-12T07:10:35+05:30 IST

సీఎం జగన్‌ తీరుపై ట్విటర్‌ వేదికగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘నమ్మినవారిని తనతోపాటు జైలుకి తీసుకెళ్లడం జైలు జగ్గడుకి అలవాటు. దేశంలోనే ఉత్తమ ఐఏఎస్‌ అధికారులుగా...

మత్తులో సంతకాలు.. తలుచుకొంటే బాధేస్తోంది: బుద్దా

విజయవాడ, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తీరుపై ట్విటర్‌ వేదికగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వ్యాఖ్యలు చేశారు. ‘‘నమ్మినవారిని తనతోపాటు జైలుకి తీసుకెళ్లడం జైలు జగ్గడుకి అలవాటు. దేశంలోనే ఉత్తమ ఐఏఎస్‌ అధికారులుగా ట్రాక్‌ రికార్డు ఉన్న అధికారులకు బ్లూ వైరస్‌ ఎక్కించి జీవచ్ఛవాలుగా మార్చేసి ఆసుపత్రి పాలుచేశాడు. తండ్రి అధికారంలో ఉంటేనే అంతమందిని మింగేశాడు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. మత్తులో సంతకాలు పెడుతున్నవారి పరిస్థితి తలచుకుంటేనే బాధేస్తోంది’’ అని వెంకన్న ట్వీట్‌ చేశారు. డీజీపీకి లేఖ రాస్తూ.. ‘‘లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న మంత్రులు, వైసీపీ నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. తక్షణం వారిని క్వారంటైన్‌ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-04-12T07:10:35+05:30 IST