-
-
Home » Andhra Pradesh » Jagan Current Shock presents nimmala ramanaidu
-
'జగనన్న కరెంట్ షాక్' కానుక ఇచ్చాడు: నిమ్మల
ABN , First Publish Date - 2020-05-13T21:03:09+05:30 IST
లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు సీఎం 'జగనన్న కరెంట్ షాక్' కానుక ఇచ్చాడని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం విద్యుత్ వినియోగం తగ్గించడానికేనా

ఏలూరు: లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు సీఎం 'జగనన్న కరెంట్ షాక్' కానుక ఇచ్చాడని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం విద్యుత్ వినియోగం తగ్గించడానికేనా? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లుల కన్నా బయట వడగాల్పులే చల్లగా ఉన్నాయని, నాడు ముద్దులు పెట్టుకుని.. నేడు పేదవాడి గుండెపై పిడిగుద్దులు గుద్దుతున్నారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.