కరోనాపై సీఎం జగన్ సమీక్ష.. అనంతరం మీడియా ముందుకు

ABN , First Publish Date - 2020-04-01T17:34:35+05:30 IST

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో సీఎం జగన్ దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

కరోనాపై సీఎం జగన్ సమీక్ష.. అనంతరం మీడియా ముందుకు

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో సీఎం జగన్ దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. పెన్షన్ పంపిణీతో పాటు రెండో విడత ఇంటింటి సర్వేపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.


కరోనా పాజిటివ్ కేసులు, కార్యాచరణ ప్రణాళికపైనా జగన్ అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశానంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్ రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించనున్నారు. 

Updated Date - 2020-04-01T17:34:35+05:30 IST