ఆ పథకాల ద్వారా వైఎస్ ఎప్పటికీ చిరంజీవే: జగన్

ABN , First Publish Date - 2020-07-08T15:50:55+05:30 IST

అమరావతి: నేడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన తండ్రిని స్మరిస్తూ ట్వీట్ చేశారు.

ఆ పథకాల ద్వారా వైఎస్ ఎప్పటికీ చిరంజీవే: జగన్

అమరావతి: నేడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన తండ్రిని స్మరిస్తూ ట్వీట్ చేశారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా ఆయన ఎప్పటికీ చిరంజీవే అన్నారు. ‘‘నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-08T15:50:55+05:30 IST