ఈ ముఖ్యమంత్రి ఒక అరిష్టం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-16T00:06:57+05:30 IST

ఈ ముఖ్యమంత్రి ఒక అరిష్టం: చంద్రబాబు

ఈ ముఖ్యమంత్రి ఒక అరిష్టం: చంద్రబాబు

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల ప్రస్తావన తెచ్చిన సీఎంను తన జీవితంలో చూడలేదని చంద్రబాబు అన్నారు. నీకు ఇష్టం లేకుంటే కులాలను ఆపాదిస్తావా?, కులంతో గెలిచావా.. నీకో కులం ఉందన్నారు. నీ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి సామాజికవర్గం పేరుతో దాడి చేస్తావా? అని ప్రశ్నించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల కోసం కేంద్రానికి లేఖ రాద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ముఖ్యమంత్రి ఒక అరిష్టం.. రాజకీయాలకు శాపమని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని విధాలా పోరుడుతామని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షనేత, ఎమ్మెల్యేలంటే గౌరవం లేదని, అధికార యంత్రాంగాన్ని చట్టానికి వ్యతిరేకంగా పనిచేయిస్తున్నారని విమర్శించారు. మీడియాను కంట్రోల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. స్వయంప్రతిపత్తి ఉన్న ఈసీని బెదిరిస్తున్నారని, మొత్తం రాష్ట్రాన్ని పులివెందుల చేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌..ఇవే చివరి ఎన్నికలు చేయలానుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ వీర్రవీగిపోతున్నారని, జగన్‌ శాశ్వత సీఎం అనుకుంటున్నాడని, ఇలాంటి పనులు చేస్తే తొందరలోనే పోతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. జగన్‌ అధికారం మత్తులో ఉన్నారని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-03-16T00:06:57+05:30 IST