జగన్, చంద్రబాబు కోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నా: జీవీఎల్‌

ABN , First Publish Date - 2020-10-01T00:36:28+05:30 IST

సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నానని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. రాముడు హిందువులకే కాదు..

జగన్, చంద్రబాబు కోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నా: జీవీఎల్‌

ఢిల్లీ: సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు బాబ్రీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నానని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. రాముడు హిందువులకే కాదు.. యావత్‌ భారత్‌కు ఆరాధ్య దైవమని ప్రకటించారు. లౌకికవాదం గురించి ఎంఐఎం నేత ఓవైసీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తప్పుబట్టారు. బాబ్రీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని నరసింహారావు ప్రకటించారు. కోర్టు తీర్పుతో కుట్రలేదని తేటతెల్లమైందని చెప్పారు. బీజేపీ సీనియర్ నేతలు అడ్వాణీ, జోషిని కుట్రపూరితంగా ఇరికించేందుకు కాంగ్రెస్‌ యత్నించిందని ఆరోపించారు. బాబ్రీ విషయంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని తప్పుబట్టారు. కోర్టు తీర్పుపై దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని జీవీఎల్‌ నరసింహారావు సూచించారు. 

Updated Date - 2020-10-01T00:36:28+05:30 IST