కరోనా నియంత్రణపై జగన్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2020-03-24T00:19:29+05:30 IST

కరోనా నియంత్రణపై సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని, కేవలం లాక్‌డౌన్‌తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని చెప్పారు.

కరోనా నియంత్రణపై జగన్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్: కరోనా నియంత్రణపై సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని, కేవలం లాక్‌డౌన్‌తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని చెప్పారు. ప్రజారోగ్య చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విదేశాల నుంచి ఏపీలోకి 15వేల మంది వచ్చారని సమాచారం ఉందని పేర్కొన్నారు. వారందరికీ కట్టుదిట్టంగా క్వారంటైన్‌ అమలు చేయాలన్నారు. కరోనా సోకినవారి కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని  చంద్రబాబు కోరారు. ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని, మార్కెట్‌లో నిత్యావసర ధరలను కట్టడి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-03-24T00:19:29+05:30 IST