-
-
Home » Andhra Pradesh » jagan cbi ycp
-
రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరిన జగన్ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-03-24T00:10:11+05:30 IST
రాజధాని భూముల వ్యవహారంపై జగన్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరింది. గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సీబీఐ దర్యాప్తును ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వం సీబీఐకి పంపింది.

అమరావతి: రాజధాని భూముల వ్యవహారంపై జగన్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరింది. గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సీబీఐ దర్యాప్తును ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వం సీబీఐకి పంపింది. కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేశామని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. జీవో నెం.46 ఏపీ హోంశాఖ కార్యదర్శి విడుదల చేశారు. సీఐడీ కేసుల వివరాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఎస్సీ, ఎస్టీలను బెదిరించి భూములు కొనుగోళ్ల కేసులను సీబీఐకి బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.