కేసీఆర్ తిరస్కరించిన నగదు బదిలీని జగన్ ఎందుకు చేపట్టారు?: కాల్వ
ABN , First Publish Date - 2020-09-04T01:50:59+05:30 IST
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అవినీతి స్కీముల కోసం అతిగా అప్పులు చేయడానికే నగదు బదిలీ చేపట్టారని

అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అవినీతి స్కీముల కోసం అతిగా అప్పులు చేయడానికే నగదు బదిలీ చేపట్టారని, సీఎం కేసీఆర్ తిరస్కరించిన నగదు బదిలీని సీఎం జగన్ ఎందుకు చేపట్టారు? అని ప్రశ్నించారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని తిరస్కరించాయని, నగదుబదిలీతో పంపుసెట్లు అధికంగా వాడే రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని కాల్వ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు.