జగన్, బీజేపీకి మానస పుత్రుడు: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-10-20T00:07:46+05:30 IST
వైసీపీ ప్రభుత్వ తీరును ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తప్పుబట్టారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వ తీరును ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తప్పుబట్టారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమరావతి, కోర్టు వంటి అంశాలను మంత్రుల భాషాప్రావీణ్యంతో పక్క దారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మానస పుత్రుడని, వైసీపీకి బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ అని ఎద్దేవాచేశారు. ఈ నెల 31న రైతులకు మద్దతుగా జిల్లా కేంద్రాల్లో కిసాన్ దివస్, వెనుకబడిన వర్గాలపై దాడులకు నిరసనగా నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా చేస్తున్నట్లు శైలజానాథ్ ప్రకటించారు.