జగన్ ఏపీని మరో బెంగాల్‌లా మార్చారు: మహాజన్
ABN , First Publish Date - 2020-06-11T22:57:25+05:30 IST
సీఎం జగన్ తన వైఫల్యాలతో ఏపీని మరో బెంగాల్‌లా మార్చారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ ఆరోపించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తిగా కుంటుపడ్డాయని

అమరావతి: సీఎం జగన్ తన వైఫల్యాలతో ఏపీని మరో బెంగాల్‌లా మార్చారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ ఆరోపించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తిగా కుంటుపడ్డాయని, ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారని దుయ్యబట్టారు. మద్యం ధరలు పెంచి, జేట్యాక్స్‌తో రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేసి ప్రజాధనం వృథాచేశారని తప్పుబట్టారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పూనమ్ మహాజన్ స్పష్టం చేశారు.