సీఎం మనసు మారాలి
ABN , First Publish Date - 2020-02-08T10:52:03+05:30 IST
‘‘రాజధాని కోసం బంగారం పండే భూములు త్యాగం చేశాం..

మసీదులో రైతుల ప్రార్థనలు..
రాయపూడి గ్రామ దేవతకు ముస్లిం మహిళల పొంగళ్లు..
కృష్ణమ్మకు సారె సమర్పణ
52వ రోజు కొనసాగిన ఆందోళనలు
గుంటూరు, తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ, ఫిబ్రవరి 7: ‘‘రాజధాని కోసం బంగారం పండే భూములు త్యాగం చేశాం.. ప్రతిపక్షనేతగా జగన్ కూడా 30వేల ఎకరాలు కావాలని చేసిన ప్రకటన తరువాత ఎంతోమంది భూమలు ప్రభుత్వానికి అప్పగించారు. నేడు మీరంటు న్న మూడు రాజధానుల వల్ల ఆర్థికభారం తప్ప ఎవరికి ప్రయోజనం’’ అంటూ అమరావతి ప్రాంత రైతులు నిలదీశారు. అమరాతినే కొనసాగించాలని కోరుతూ 52వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం లో మహాధర్నా నిర్వహించగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. సీఎం జగన్ మనసు మార్చాలంటూ తు ళ్లూరు రైతులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయపూడి ముస్లిం మహిళలు బొడ్డురాయికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామదేవత పోలేరమ్మకు దళిత, ముస్లిం మహిళలు పొంగళ్లు పెట్టి, పూజ లు నిర్వహించారు. రాయపూడి కృష్ణా ఘాట్‌లో వెలగపూడి రైతులు జలదీక్ష నిర్వహించారు. కృష్ణమ్మకు చీరె, సారె సమర్పించి, హారతులు ఇచ్చారు. పెదపరిమిలో పెద్దసంఖ్యలో రైతులు, మహిళలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌనంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి దీక్షా శిబిరంలో యువరైతులు తాడికొండ శ్రీకర్, బొర్ర రవిచంద్ర చేపట్టిన 151 గంటల నిరాహార దీక్ష ముగిసింది. విద్యార్థి జేఏసీ అధ్యర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ ఎదురుగా నిరసన తెలపనున్నారు. మందడంలో మహిళలు, రైతులు చేస్తున్న దీక్షకు మాజీమంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు సంఘీభావం తెలిపారు. మందడంలో 3వ తరగతి విద్యార్థి ఎర్రమనేని వరుణ్‌సాయి 24గంటల నిరాహార దీక్ష చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జేఏసీ నేతలు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు 41వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను టీడీపీ నేత మాకినేని పెదరత్త య్య ప్రారంభించారు. పెనుమాకలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు 52వ రోజుకు, తాడికొండ అడ్డరోడ్డులో రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలు 35వ రోజు కు చేరుకున్నాయి. నవులూరు, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు, పెదవడ్లపూడి గ్రామాల్లో రిలే నిరస న దీక్షలు శుక్రవారంతో 52వ రోజుకు చేరాయి. అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మంగళగిరి పాతబస్టాండు వద్ద రిలే దీక్షలు కొనసాగాయి. కాగా, రాజధాని సమస్యపై సీఎంతో భేటీకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి నకిలీ రైతుల ను, వైసీపీ కార్యకర్తలను తీసుకువెళ్లారని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు బ్రహ్మాంచౌదరి ఆరోపించారు. రాయచోటి ప్రజలు అమరావతి కోసం బైక్ ర్యాలీ ఎందుకు చేశారని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అమరావతి ముద్దు.. వికేంద్రీకరణ వద్దు అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో 4వేల మందికి పై గా మహిళలు, యువకులు పాల్గొన్నారు. విద్యాధరపురం నుంచి కబేళా వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ ఎ మ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, జేఏసీ నేతలు గద్దె తిరుపతిరావు, సుంకర పద్మశ్రీ, పోతిన వెంకట మహేశ్, బొమ్మసాని సుబ్బారావు, పి.దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.