బేసిక్‌ ప్యాకేజీలో చానెళ్ల తొలగింపుపై కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ధర్నా

ABN , First Publish Date - 2020-12-19T14:21:15+05:30 IST

ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయం ఎదుట ఆపరేటర్ల జేఏసీ మెరుపు ధర్నాకి దిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని వారు నిరసన వ్యక్తం చేశారు.

బేసిక్‌ ప్యాకేజీలో చానెళ్ల తొలగింపుపై కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ధర్నా

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయం ఎదుట  కేబుల్ ఆపరేటర్ల జేఏసీ మెరుపు ధర్నాకి దిగింది.  తమ సమస్యలను పరిష్కరించాలని వారు నిరసన వ్యక్తం చేశారు. బేసిక్‌ ప్యాకేజీలో తరచూ పలు చానెళ్ల తొలగింపు విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బేసిక్‌ ప్యాకేజీలో పలు చానెళ్లను తొలగిస్తే తీవ్రంగా నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో 13మంది  కేబుల్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఎండీ అపాయింట్‌మెంట్ ఇచ్చి తమను కలవకుండా బయటకు వెళ్లాడని, తమ సమస్యలను పరిష్కరించే వరకు ధర్నా విరమించవని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.

Read more