72 గంటలైంది... ఏసీబీ ఏం చేస్తోంది?: బాబు ట్వీట్‌

ABN , First Publish Date - 2020-07-19T08:53:12+05:30 IST

ఐదు కోట్ల రూపాయలు పట్టుబడి 72 గంటలైందని, ఏసీబీ ఏం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అంశంపై

72 గంటలైంది... ఏసీబీ ఏం చేస్తోంది?: బాబు ట్వీట్‌

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఐదు కోట్ల రూపాయలు పట్టుబడి 72 గంటలైందని, ఏసీబీ ఏం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అంశంపై శనివారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ‘రూ.5.27 కోట్లు పట్టుబడి 72 గంటలు దాటిపోయింది. కాని ఇప్పటివరకూ ఏపీ ఏసీబీ ఏ చర్యలూ తీసుకోలేదు. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే బాధ్యత మాత్రమే వారు తీసుకొన్నారా? అధికార పార్టీ సభ్యులతో సంబంధం ఉండి అవినీతి లేదా మనీ లాండరింగ్‌ చేసే వారిపై ఏసీబీ శీతకన్ను వేసిందా? మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైఎస్‌ జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కావలి మునిసిపాలిటీలో భాగమైన ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసానికి... అమర్యాదకరంగా తొలగించడానికి కారణమైన కావలి ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సంప్రదాయాల పట్ల, చారిత్రిక వ్యక్తుల పట్ల అమర్యాదకరంగా... చట్ట విరుద్ధంగా ప్రవర్తించడాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. ఈ దుశ్చర్యకు కారకులైన వారిపై పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని చంద్రబాబు కోరారు.

Updated Date - 2020-07-19T08:53:12+05:30 IST