-
-
Home » Andhra Pradesh » Is drinking water pollution the cause of a strange disease in Eluru
-
ఏలూరులో వింత వ్యాధికి తాగునీటి కాలుష్యమే కారణమా...
ABN , First Publish Date - 2020-12-10T17:30:41+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధికి తాగునీరు కలుషితమే కారణమని కేంద్ర నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాగునీటిలో పురుగుల మందుల అవశేషాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధికి తాగునీరు కలుషితమే కారణమని కేంద్ర నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాగునీటిలో పురుగుల మందుల అవశేషాలు కలవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. తాగునీటిలో ఆర్గానో క్లోరో, ఆర్గానో పాస్పరస్ అవశేషాలను గుర్తించారు. 90 శాతం నీటిలో ఈ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. తాగునీటిలో ఎలా కలిశాయన్నదానిపై నిపుణుల అధ్యయనం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి కాలువల నీటిని కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలించింది. రెండు కాలువల నీరు ఏయే ప్రాంతాలకు వెళ్తుందో.. ఏలూరు మ్యాప్ ద్వారా కేంద్ర నిపుణుల కమిటీ గుర్తించింది.
మరోవైపు అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రి పాలై కోలుకున్నారని ఇంటికి పంపిన బాధితులను ఇంకా ఆరోగ్య సమస్యలు వెంటా డుతున్నాయి. ఫిట్స్ తగ్గినా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. షుగరు, వెన్నునొప్పి, తలనొప్పి, నీరసం, భయం, కాళ్లూ, చేతులు గుంజుకుపోవడం, నరాలు సలపడం వంటి పలురకాల సమ స్యలతో బాధ పడుతున్నారు. కొందరైతే ఇంకా లేచి కూర్చోలేని పరిస్థితి. పూర్తిస్థాయిలో కోలుకోకుండానే తమను ఇంటికి పంపేశారని వాపోతున్నారు. దక్షిణపువీధిలో మొదలైన వింత వ్యాధి బుధవారానికి తగ్గింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు 21 కేసులు రావడంతో బాధితుల సంఖ్య మొత్తం 590కు చేరింది.