కరోనాతో ఇస్త్రీ దుకాణం మూత

ABN , First Publish Date - 2020-07-20T07:46:45+05:30 IST

ప్పుల బాధకు తోడు లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇస్త్రీ బంకు నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనాతో ఇస్త్రీ దుకాణం మూత

ఆర్థిక ఇబ్బందులతో నిర్వాహకుడి ఆత్మహత్య


అద్దంకి, జూలై 19: అప్పుల బాధకు తోడు లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇస్త్రీ బంకు నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని సాయిబాబాగుడి ప్రాంతానికి చెందిన కంచర్ల అంజయ్య (50) ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంతంలో ఇస్ర్తీ దుకాణం నిర్వహిస్తున్నాడు. కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి దుకాణం మూసివేశాడు. షాపు అద్దె, దుకాణంలో పనిచేసే కూలీల ఖర్చులు భారంగా మారాయి. గతంలో చేసిన అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి కూడా పెరగడంతో కొద్దిరోజులుగా ఆయన తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. ఆదివారం తన షాపులో పనిచేసే వ్యక్తి ఉంటున్న గదికి వెళ్లాడు. తినుబండారాలు తేవాలని ఆ యువకుడిని బయటకు పంపాడు. అనంతరం ఆ గదిలో అంజయ్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-20T07:46:45+05:30 IST