తెనాలి చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2020-08-11T20:03:28+05:30 IST

గుంటూరు: తెనాలి చోరీ కేసును పోలీసులు ఒక్క రోజులో ఛేదించారు. చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెనాలి చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి..

గుంటూరు: తెనాలి చోరీ కేసును పోలీసులు ఒక్క రోజులో ఛేదించారు. చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న తెనాలి ఇస్లాంపేటలో కౌతారపు నమ్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. 24 గంటల్లో నిందితుడు తిరుపతయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. 21.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2.50 లక్షల మాత్రమే  చోరీ జరిగిందని నమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఫిర్యాదులో తక్కువ నగదు చూపడంపై పోలీసుల విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుడు నాయుడు తిరుపతయ్య రేపల్లె వాసి. రెండు నెలల క్రితమే ఇదే ఇంట్లో 5 లక్షల చోరీకి పాల్పడ్డాడు. బెయిల్ పై వచ్చి మరల అదే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.  చోరీ జరిగిన ఇంటి యాజమాని గుట్కా వ్యాపారిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  గుట్కా వ్యాపారంలో సంపాదన కావడంతో ఫిర్యాదులో అసలు విషయం వ్యాపారి పేర్కొనలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2020-08-11T20:03:28+05:30 IST