రేషన్‌ బియ్యానికి రెక్కలు

ABN , First Publish Date - 2020-03-15T08:23:06+05:30 IST

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి, నెల్లూరు జిల్లా కృష్టపట్నం పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు...

రేషన్‌ బియ్యానికి రెక్కలు

అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

నెల్లూరు ( క్రైం), మార్చి 14: రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి, నెల్లూరు జిల్లా కృష్టపట్నం పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు శనివారం అరెస్టుచేశారు. నిందితుల వివరాలను ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ విలేకరులకు తెలిపారు. గత నెల 29వ తేదీన కృష్ణపట్నం పోర్టులోని సీ బడ్‌ సీఎ్‌ఫఎస్‌ గోదాములో నిల్వ ఉంచిన 1,645 టన్నుల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కృష్ణపట్నం కస్టమ్స్‌, జిల్లా సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటనపై ఈ నెల 1వ తేదీన కృష్ణపట్నం పోర్టు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌.. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు.


ఈ బృందం దర్యాప్తు ప్రారంభించి నలుగురు నిందితులను వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. ఈ ముఠాకు చెందిన కృష్ణా జిల్లా విజయవాడలోని ఎంఎ్‌సఆర్‌ ట్రేడర్స్‌ యజమాని షేక్‌ సయ్యద్‌, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన మొయికొమాడియేట్స్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ మంచికల వీరవెంకట సత్యశివప్రసాద్‌.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన శ్రీరాజ్యలక్ష్మి రా అండ్‌ బాయిల్డ్‌ రైస్‌మిల్లు యజమాని కుంకాల రవి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శ్రీ బాలాజీ ట్రేడర్స్‌ రైస్‌మిల్లు యజమాని బతుల వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టుచేశారు. వీరంతా రేషన్‌ బియ్యాన్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి, వాటిని రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు తప్పుడు బిల్లులు, ఇన్‌వాయి్‌సలను సృష్టిస్తారు. పలు బ్రాండ్ల పేర్లతో ఉన్న రైస్‌బ్యాగుల్లో నింపి ఎగుమతి చేస్తున్నారు. ఈ కేసులో మరి కొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-03-15T08:23:06+05:30 IST