ప.గో.జిల్లా ఐ.బీమవరంలో అమానవీయ ఘటన
ABN , First Publish Date - 2020-07-27T20:29:30+05:30 IST
108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆఖరికి...

ప.గో.జిల్లా: 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆఖరికి ప్రైవేట్ అంబులెన్సులు రాలేదు. దీంతో చేసేదిలేక చెత్తను తరలించే ఆటోలోనే ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ అమానవీయ ఘటన ప.గో.జిల్లా, ఆకివీడు మండలం, ఐ.భీమవరం గ్రామంలో జరిగింది. ఐ.భీమవరం బస్సాప్‌లో ఓ వ్యక్తి రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి అయినవారు ఎవరూ లేరు. అయితే కరోనా భయంతో ఆ వ్యక్తివద్దకు ఎవరూ వెళ్లలేదు. చివరికి అతని ధీన స్థితిని చూడలేక కొందరు 108కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫలితం లేదు. దీంతో చెత్త ఆటోలో ఆకవీడు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ఏలూరుకు తరలించారు.