ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు విషయంలో సేవకులకు మంగళం!
ABN , First Publish Date - 2020-12-18T01:41:30+05:30 IST
ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు విషయంలో సేవకులకు మంగళంపాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిలో తరచుగా జరిగే చోరీలు జరుగుతుండటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు విషయంలో సేవకులకు మంగళంపాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిలో తరచుగా జరిగే చోరీలు జరుగుతుండటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సేవకుల స్థానంలో ఆలయ సిబ్బందినే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో పాలకమండలి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం జరిగిన అమ్మవారి హుండీల ఆదాయం లెక్కింపులో గుర్తింపు కార్డుతో సేవకురాలిగా పాల్గొన్న మహిళ చేతివాటాన్ని ప్రదర్శించింది. రూ.60వేలకు పైగా నగదు, అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన చిన్నచిన్న బంగారు వస్తువులను తస్కరించింది. వీటి విలువ దాదాపు రూ.లక్ష పైనే. ఈ మొత్తాన్నీ అధికారులు ఇచ్చిన గుర్తింపు కార్డులోనే పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నించింది. చివరికి దేవస్థానం ప్రత్యేక భద్రతా సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది.