రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దుర్గాదేవి

ABN , First Publish Date - 2020-10-27T08:24:02+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారంనాడు విజయవంతంగా ముగిశాయి. చివరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి..

రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దుర్గాదేవి

విజయవాడ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారంనాడు విజయవంతంగా ముగిశాయి. చివరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కృష్ణానదికి తీసుకువచ్చారు. అక్కడ దుర్గాఘాట్‌లో హంస వాహన సేవను కన్నులపండువగా నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు సోమవారం అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు.

Updated Date - 2020-10-27T08:24:02+05:30 IST