తగ్గని కరోనా తీవ్రత

ABN , First Publish Date - 2020-12-07T08:52:47+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 667 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు.

తగ్గని కరోనా తీవ్రత

కొత్తగా 667 పాజిటివ్‌ కేసులు 

24 గంటల్లో 9 మంది మృతి 


అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 667 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 8,71,972కి చేరింది. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5,910గా ఉంది. ఇప్పటి వరకు 8,59,029 లక్షల మంది కోలుకోగా, 7,033 మంది మరణించారు. ఇక, జిల్లాల విషయానికి వస్తే.. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆదివారం కొత్తగా 129 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఇద్దరు బాధితులు మరణించారు. గుంటూరు జిల్లాలో 114 మందికి పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. చిత్తూరులో 105 మందికి పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతున్న ఇద్దరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 86,942కు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలో 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 45,865కు చేరింది. విజయనగరంలో 18 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 40,879కి చేరింది. 

Updated Date - 2020-12-07T08:52:47+05:30 IST