కర్నూలులో పెరిగిన ఎండల తీవ్రత

ABN , First Publish Date - 2020-05-24T21:34:39+05:30 IST

నగరంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది.

కర్నూలులో పెరిగిన ఎండల తీవ్రత

కర్నూలు: నగరంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. వడగాల్పులబారిన పడి చాలామంది ఆస్పత్రిపాలవుతున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు భగభగమండే ఎండలతో కర్నూలు నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడు నగరంపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో పనులపై బయటకు వచ్చిన జనాలు తొందరగా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. 11 గంటల నుంచి వడగాలులు విపరీతంగా ఉండడంతో వడదెబ్బబారినపడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి.

Updated Date - 2020-05-24T21:34:39+05:30 IST