గాలిలో పెరిగిన తేమ

ABN , First Publish Date - 2020-12-28T10:00:21+05:30 IST

తూర్పు, ఈశాన్య గాలులతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. ఉత్తరకోస్తాలో 70ు పైగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 80-95ు తేమ నమోదవుతోందని ఐఎండీ ...

గాలిలో పెరిగిన తేమ

అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తూర్పు, ఈశాన్య గాలులతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. ఉత్తరకోస్తాలో 70ు పైగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 80-95ు తేమ నమోదవుతోందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ, రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలు, తీరప్రాంతాలు, హైవే రోడ్లపై అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. సాయంత్రం 4గంటల నుంచే చలి మొదలవుతోంది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగులలో ఆదివారం 4.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెలాఖరు వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-12-28T10:00:21+05:30 IST