వైసీపీలో అసహనం పెరిగిపోయింది అందుకే..: సీపీఎం నేత

ABN , First Publish Date - 2020-06-16T19:14:05+05:30 IST

మీడియాపై వైసీపీ నేతల దౌర్జన్యాలు చూస్తుంటే.. ప్రభుత్వం.. వైసీపీ నేతల్లో..

వైసీపీలో అసహనం పెరిగిపోయింది అందుకే..: సీపీఎం నేత

హిందూపురం: మీడియాపై వైసీపీ నేతల దౌర్జన్యాలు చూస్తుంటే.. ప్రభుత్వం.. వైసీపీ నేతల్లో ఏ స్థాయిలో అసహనం పెరిగిపోయిందో అర్థమవుతుందని సీపీఎం నేత రాంభూపాల్ అన్నారు. మంగళవారం హిందూపురంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై  వైసీపీ నేతలు రౌడీయిజం చేశారు. ప్రశ్నలు అడగొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా దాడికి కూడా ప్రయత్నించారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ మీడియా సమావేశాల్లో విలేకరులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా ఏ రాజకీయ నాయకుడు తమ పార్టీ అభిప్రాయాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సాధ్యంకాదని అన్నారు. విలేకరులు తమ వృత్తి ధర్మంగా ప్రశ్నలు వేయడం సహజమన్నారు.

Updated Date - 2020-06-16T19:14:05+05:30 IST