-
-
Home » Andhra Pradesh » Inauguration of Punganur Court Building
-
పుంగనూరు కోర్టు భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-10T09:06:07+05:30 IST
నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్తూరు జిల్లా పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు

హిందూపురం జడ్జిల క్వార్టర్స్ కూడా.. నెల్లూరు కోర్టు భవనానికి శంకుస్థాపన
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్తూరు జిల్లా పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు. బుధవారం హైకోర్టు ప్రాంగణం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం జిల్లా హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జిల రెసిడెన్షియల్ క్వార్టర్లనూ ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో 6వ కోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రఘునందన్ రావ్, జస్టిస్ రమేశ్ పాల్గొన్నారు.