ఏపీ సహా 4 రాష్ట్రాల్లో.. వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం
ABN , First Publish Date - 2020-12-30T09:22:28+05:30 IST
ఆంధ్రప్రదేశ్ తో పాటు పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన కొవిడ్-19 వ్యాక్సిన్ సన్నాహక ప్రక్రియ (డ్రైరన్) విజయవంతమైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ తో పాటు పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన కొవిడ్-19 వ్యాక్సిన్ సన్నాహక ప్రక్రియ (డ్రైరన్) విజయవంతమైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28,29 తేదీల్లో ఏపీలోని కృష్ణా జిల్లా, గుజరాత్, పంజాబ్, అసోంలలో ఎంపిక చేసిన జిల్లాల్లో డ్రై రన్‌ను నిర్వహించారు.