-
-
Home » Andhra Pradesh » imd officers bangalakhatam amaravathi
-
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , First Publish Date - 2020-05-14T00:19:27+05:30 IST
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో బలపడి

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఐఎండీ సూచనల ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 40°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లు, వృద్ధులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.