తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రాకు మద్యం తరలింపు
ABN , First Publish Date - 2020-06-19T02:34:17+05:30 IST
తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రాకు మద్యం తరలింపు
సూర్యాపేట: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత మంది అక్రమార్కులు అడ్డదారిలో మద్యాన్ని తరలిస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా అక్రమంగా మద్యాన్ని కొంత మంది వ్యాపారులు తరలిస్తున్నారు. కోదాడ శివారు అల్వాలపురం వద్ద ఆటోలో ఆంధ్రాకు రూ. లక్షా 50 వేల విలువైన మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితమే కోదాడ సరిహద్దులో ఆంధ్రాకు తరలిస్తున్న రూ. 7 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.