అక్రమ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-06-22T00:25:53+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం నిత్యం అక్రమంగా తరలుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబడింది. సూర్యాపేట నుంచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తున్న లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

అక్రమ మద్యం పట్టివేత

దుగ్గిరాల : ఆంధ్రప్రదేశ్‌లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం నిత్యం అక్రమంగా తరలుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబడింది. సూర్యాపేట నుంచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తున్న లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.


లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తెనాలి ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. తవుడు లారీలో తరలిస్తున్న రూ. 3.50 లక్షల విలువైన 72 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు మద్యం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు.


సుమారు మూడున్నర లక్షల రూపాయల విలువైన 72 కేసుల్లోని 3,742 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికి ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి ఎక్సైజ్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-06-22T00:25:53+05:30 IST