విజయనగరంలో గెడ్డ కబ్జా

ABN , First Publish Date - 2020-12-13T15:35:22+05:30 IST

చెరువులైనా.. సెలఏరులైనా.. వాగులైనా.. వంకలైనా.. ఏది కనిపిస్తే అదే కబ్జా చేసేస్తున్నారు.

విజయనగరంలో గెడ్డ కబ్జా

విజయనగరం: చెరువులైనా.. సెలఏరులైనా.. వాగులైనా.. వంకలైనా.. ఏది కనిపిస్తే అదే కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రి చదును చేసేస్తున్నారు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏపీలో అధికారపార్టీ నేతల అండదండలతోనో యథేచ్ఛగా కబ్జాలు కొనసాగుతున్నాయి. విజయనగరం జమ్మె చెక్‌పోస్టు సమీపంలో గడ్డెను ఓ భూ బకాసురుడు రాత్రికి రాత్రే కప్పేసాడు. ఉత్తర నుంచి దక్షిణవైపు ప్రవహించే ఈ గెడ్డను పూర్తి స్థాయిలో చదును చేశారు. లే ఔట్లు వేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఈ గెడ్డలోనే కొంతమంది శ్మశానంగా వినియోగిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తుందని కొందరు.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందని మరి కొందరు ప్రభుత్వ స్థలాలను పూర్తి స్థాయిలో ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ప్రజలకు ఉపయోగపడే ఈ గెడ్డను భూ బకాసురులు వశపర్చుకుంటారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-13T15:35:22+05:30 IST