నలుగురు మాజీ మంతులపై అక్రమ కేసులు పెట్టారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-06-19T02:11:40+05:30 IST
ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధాన వ్యవస్థలు మూలస్తంభాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాన వ్యవస్థలను ప్రభుత్వం కుప్పకూల్చే పరిస్థితికి తెచ్చిందన్నారు.

అమరావతి: ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధాన వ్యవస్థలు మూలస్తంభాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాన వ్యవస్థలను ప్రభుత్వం కుప్పకూల్చే పరిస్థితికి తెచ్చిందన్నారు. అసెంబ్లీలో వైసీపీకి మండలిలో టీడీపీకి మెజార్టీ ఉందని తెలిపారు. లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆగిన బిల్లులు చాలా ఉన్నాయని గుర్తుచేశారు. రాజ్యసభలో మెజార్టీ లేక ఆమోదం పొందనిని చాలా ఉన్నాయని చెప్పారు. నలుగురు మాజీ మంతులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని, అసెంబ్లీకి అందరినీ రమ్మని చెప్పారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, గన్‌మెన్లు అందరూ వచ్చారని, ప్రజాప్రతినిధులు, సిబ్బందిలో ఎందరికి కరోనా ఉందో తెలియదన్నారు. 155 రోజులుగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.