కేజీహెచ్‌కు వెళ్తే ఎన్టీఆర్ పదవి పోయింది
ABN , First Publish Date - 2020-05-09T10:24:18+05:30 IST
‘ఎన్టీఆర్ 1995లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి వెళ్లారు. ఆయన పదవి పోయింది.
జగన్ ధైర్యం చేసి వెళ్లారు: పీవీపీ
విజయవాడ, మే 8: ‘ఎన్టీఆర్ 1995లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి వెళ్లారు. ఆయన పదవి పోయింది. ఆ భయంతో ఆ తర్వాత ఏ సీఎం అక్కడికి వెళ్లలేదు. 25 ఏళ్ల తర్వాత జగన్ ధైర్యం చేసి మళ్లీ కేజీహెచ్‌లో అడుగుపెట్టారు’ అని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) పేర్కొన్నారు. పదవి కన్నా ప్రజాసంక్షేమం ప్రధానంగా భావించి జగన్ కేజీహెచ్‌కి వెళ్లారని శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.