మాస్క్‌ లేకుంటే చెంపదెబ్బే!

ABN , First Publish Date - 2020-06-06T10:04:52+05:30 IST

మాస్కు లేకుండా బయటకు వస్తే చెంపదెబ్బకు సిద్ధపడాల్సిందే. విజయనగరం జిల్లా సాలూరు మునిసిపాల్టీలో వినూత్న దండనకు శ్రీకారం చుట్టారు కమిషనర్‌ నూకేశ్వరరావు. శుక్రవారం పట్టణంలో ముగ్గురు యువకులు

మాస్క్‌ లేకుంటే చెంపదెబ్బే!

సాలూరు రూరల్‌, జూన్‌ 5:  మాస్కు లేకుండా బయటకు వస్తే చెంపదెబ్బకు సిద్ధపడాల్సిందే. విజయనగరం జిల్లా సాలూరు మునిసిపాల్టీలో వినూత్న దండనకు శ్రీకారం చుట్టారు కమిషనర్‌ నూకేశ్వరరావు. శుక్రవారం పట్టణంలో ముగ్గురు యువకులు మాస్కులు ధరించకుండా ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకుంటూ  సంచరిస్తున్నారు. వారిని గుర్తించిన కమిషనర్‌ నూకేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనందుకు ఒకరి చెంపపై మరోకరు కొట్టుకోవాలని ఆదేశించారు. దీంతో వారు ఒకరు చెంపపై మరోకరు కొట్టుకొని వారికి వారే దండించుకున్నారు. ఇకపై మాస్క్‌ లేకుండా బయటకురామని ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - 2020-06-06T10:04:52+05:30 IST