విమానం దిగితే క్వారంటైన్‌కే..
ABN , First Publish Date - 2020-05-09T09:13:49+05:30 IST
కరోనా వల్ల ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోడానికి సిద్ధంగా ఉండాలని ఆధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
బెడ్లను లక్షకు పెంచండి
ఈ విపత్తుకు విలేజ్ క్లినిక్‌తో చెక్
ప్రిస్ర్కిప్షన్ రాసిన 24 గంటల్లోపే
టెలిమెడిసిన్‌లో మందులందాలి
నెగెటివ్ కేసులనూ నివేదించండి
అధికారులకు సీఎం ఆదేశాలు
రాష్ర్టానికి చేరిన కేంద్ర బృందం
నేటి నుంచి జిల్లాల్లో పర్యటన
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోడానికి సిద్ధంగా ఉండాలని ఆధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోను విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యరంగంలో టెలిమెడిసిన్ విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ఈ విధానాన్ని మరింతగా విజయవంతం చేయాలని ఆదేశించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిని నేరుగా క్వారంటైన్‌కు పంపాలని స్పష్టం చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కొవిడ్ -19పై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించారు. ‘‘టెలిమెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన 24గంటల్లోనే ఇంటికి మందులూ, వైద్యసేవలూ అందాలి. డాక్టర్లు ప్రిస్ర్కిప్షన్ ఇచ్చిన ఒకరోజులోపే మందులు ఇంటికి చేరాలి. దీనికోసం సిబ్బందికి బైకు, ఽథర్మో బ్యాగు ఇవ్వాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగినన్ని బైకులు సిద్ధం చేయాలి. లేకపోతే వాటిని కొనుగోలు చేయాలి. థర్మో బ్యాగులనూ అందుబాటులో ఉంచాలి’’ అని సీఎం ఆదేశించారు.
పొలం వెళ్లే రైతులకు పాసులు: సీఎం
ఖరీఫ్ సీజన్‌లో రైతులు పొలం పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాసులను అనుమతించాలని సీఎం స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధశాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించండి
రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి జనజీవన్ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించండి’’ అని ్డ ఆయా బీమా సంస్థలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు శుక్రవారం ఆయన ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్, యూనైటెడ్ ఇన్సూరెన్సు సీఎండీ గిరీశ్ రాధాకృష్ణన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు.