సీఎం నిర్ణయం తీసుకుంటే బస్సులు నడుపుతాం: పేర్నినాని

ABN , First Publish Date - 2020-05-18T18:52:47+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుపుతామని..

సీఎం నిర్ణయం తీసుకుంటే బస్సులు నడుపుతాం: పేర్నినాని

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుపుతామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతి రోజూ టాస్క్ ఫోర్స్‌తోనూ,  కేంద్రం ఇస్తున్న విధివిధానాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులను కూడా పూర్తిగా అధ్యయనం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి బస్సులు నడుపుతామని అన్నారు. బస్సులు నడపడానికి ఆర్టీసీ అయితే సిద్ధంగా ఉందన్నారు. కానీ సీఎం జగన్ టాస్క్ ఫోర్స్‌కు ఆదేశాలు ఇచ్చేంతవరకు ఏమీ చేయడానికి అవకాశం లేదన్నారు. కేంద్రం నిబంధనల మేరకు, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్ నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని చెప్పారు.

Updated Date - 2020-05-18T18:52:47+05:30 IST