దళిత బిడ్డను హత్య చేస్తే..

ABN , First Publish Date - 2020-12-28T08:58:31+05:30 IST

దళిత యువతి స్నేహలతను ప్రేమోన్మాది హత్య చేస్తే హోంమంత్రి సుచరిత ఎస్సీ మహిళ అయి ఉండి కూడా పరామర్శకు రాకపోవడం దారుణమని మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌ కుమార్‌ విమర్శించారు.

దళిత బిడ్డను హత్య చేస్తే..

పరామర్శకు వచ్చేందుకు చార్జీ డబ్బుల్లేవా..?

హోంమంత్రిపై మాజీ జడ్జి శ్రవణ్‌కుమార్‌ ఆగ్రహం


అనంతపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దళిత యువతి స్నేహలతను ప్రేమోన్మాది హత్య చేస్తే హోంమంత్రి సుచరిత ఎస్సీ మహిళ అయి ఉండి కూడా పరామర్శకు రాకపోవడం దారుణమని మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌ కుమార్‌ విమర్శించారు. ‘పరామర్శకు వచ్చేందుకు చార్జీలకు డబ్బులు లేవా..? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన స్నేహలత కటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలన్నారు. ‘ఆడబిడ్డలకు ఏ కష్టమొచ్చినా.. మా సీఎం జగన్‌ బుల్లెట్‌ స్పీడుతో వస్తాడని చెప్పిన రోజమ్మా.. ఇప్పుడెక్కడమ్మా మీ తుప్పుపట్టిన బుల్లెట్‌’ అని ఎద్దేవా చేశారు. 


స్నేహలతది ప్రభుత్వ హత్యే: హర్షకుమార్‌

స్నేహలతది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. ఆదివారం అనంతపురం వచ్చిన ఆయన స్నేహలత చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మీడియాతో మాట్లాడారు. స్నేహలత ఒక దళిత ముత్యమని, క్రీడల్లో ఆమె సాధించిన పతకాలను చూపించారు. స్నేహలత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్నేహలత హంతకులను ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు.

Read more