ఏపీ కోవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారిగా రాజమౌళి

ABN , First Publish Date - 2020-07-11T04:18:36+05:30 IST

ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెస్ట్‌లు పెంచడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది....

ఏపీ కోవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారిగా రాజమౌళి

అమరావతి : ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెస్ట్‌లు పెంచడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్ల పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించింది. ఈ కీలక బాధ్యతలను ఐఏఎస్ అధికారి రాజమౌళికి అప్పగించింది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్‌గా రాజమౌళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 


కాగా.. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజమౌళి సీఎం పేషీలోనూ విధులు నిర్వహించారు. జగన్ సీఎం అయిన అనంతరం చాలా కాలంగా పోస్టింగ్ కోసం ఆయన వెయిటింగ్ చేశారు. అయితే ఆయన అనుభవాన్ని, సీనియార్టీని పరిశీలించిన జగన్ సర్కార్ ఈ మేరకు శుక్రవారం నాడు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రాష్ట్ర, జిల్లా కోవిడ్ ఆసుపత్రుల్లో ఏర్పాట్లను రాజమౌళి పర్యవేక్షించి.. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు.

Updated Date - 2020-07-11T04:18:36+05:30 IST