నా ప్రమేయం ఉందని తేలితే రాజీనామా చేస్తా
ABN , First Publish Date - 2020-10-10T07:46:01+05:30 IST
సీఎంఆర్‌ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంలో తన ప్రమేయం ఉందని ఏ దశలో తేలినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కుంభకోణంపై ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 9: సీఎంఆర్‌ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంలో తన ప్రమేయం ఉందని ఏ దశలో తేలినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తన కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డిని కొందరు మేనేజ్ చేసి ఐదారు సీఎంఆర్‌ఎఫ్ పాత చెక్కులు తీసుకున్నది వాస్తవమేనని, అందులో మూడు చెక్కులకు సంబంధించి రూ.9 లక్షల 90 వేలు డ్రా చేసుకున్నారని, మిగిలిన చెక్కులపై రూ.40 కోట్లకుపైనే ఓ ట్రస్టు పేరిట డ్రా చేసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో నకిలీ చెక్కుల బాగోతాన్ని అధికారులు కనుగొన్నారన్నారు. తామే చెన్నకేశవరెడ్డిని పోలీసుల ఎదుట హాజరుపరచి విచారణకు సహకరించామని చెప్పారు.