నన్ను కిడ్నాప్‌ చేయలేదు.. భయపడి దాక్కున్నా!

ABN , First Publish Date - 2020-03-15T08:38:23+05:30 IST

‘నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని...

నన్ను కిడ్నాప్‌ చేయలేదు.. భయపడి దాక్కున్నా!

జనసేన ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి

భీమవరం రూరల్‌, మార్చి 14: ‘నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ నాయకులు బెదిరించారు. దీంతో భయపడి మరో ప్రాంతానికి వెళ్లి దాక్కున్నా’ అని పశ్చిమగోదావరి జిల్లా వెంప జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గెడ్డం లక్ష్మి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం బయట శనివారం జనసేన నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.  నామినేషన్‌ వేసినప్పటి నుంచి వెంపలో పెద్ద నాయకులు తనను భయపెట్టారని చెప్పారు.

Updated Date - 2020-03-15T08:38:23+05:30 IST