-
-
Home » Andhra Pradesh » HYDROXY CHOLORO QUINONE TO CORONA DOCTORS
-
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు ఆర్డర్
ABN , First Publish Date - 2020-03-25T08:00:01+05:30 IST
కరోనా బాధితులకేమో కానీ వారికి వైద్యం చేసే సిబ్బందికి మాత్రం కొంత ఊరట లభించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై వైరస్ ప్రభావం లేకుండా చేసేందుకు...

- 2 లక్షల మాత్రలు కొనుగోలుకు సర్కారు సిద్ధం
- కరోనా నిర్ధారణ కోసం మరో మూడు ల్యాబ్‌లు
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకేమో కానీ వారికి వైద్యం చేసే సిబ్బందికి మాత్రం కొంత ఊరట లభించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై వైరస్ ప్రభావం లేకుండా చేసేందుకు, వారిలో వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను ఉపయోగించవచ్చునని ఐసీఎంఆర్ సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పుడు వాటిని సిద్ధం చేసే ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల టాబ్లెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వాటిని వైద్య సిబ్బందికి వాడొచ్చని కేంద్రం స్పష్టమైన ఆదేశాలివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఇప్పటికే కంపెనీలకు ఆర్డర్ ఇచ్చేసింది. వారం రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
రోజూ 1000 శాంపిల్స్ పరీక్షించేలా..
కరోనా వ్యాధి నిర్ధారణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురంలో మాత్రమే వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా విశాఖపట్నం, గుంటూరు, కడపలో కూడా కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ ఏడు ల్యాబ్స్ ద్వారా ప్రతిరోజు 1000 శాంపిల్స్‌ను పరీక్షించే విధంగా ఏర్పాటు చేస్తోంది.