కురిచేడు ఘటనతో హైదరాబాద్కు లింక్...
ABN , First Publish Date - 2020-08-11T16:52:00+05:30 IST
కుత్బుల్లాపూర్: ఏపీలోని కురిచేడులో పర్ ఫెక్ట్ శానిటైజర్ తాగి 16 మంది మరణించిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.

కుత్బుల్లాపూర్: ఏపీలోని కురిచేడులో పర్ ఫెక్ట్ శానిటైజర్ తాగి 16 మంది మరణించిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో హైదరాబాద్కు లింక్ ఉన్నట్లు ఏపీ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని జీడిమెట్ల కేంద్రంగా శ్రీనివాసరావు పర్ఫెక్ట్ శానిటైజర్ తయారు చేస్తున్నారు. మూడో తరగతి చదివిన శ్రీనివాసరావు.. యూట్యూబ్లో వీడియోలు చూసి శానిటైజర్లు తయారీ చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. శానిటైజర్ తయారీకి ప్రమాదకరమైన మిథైల్ క్లోరైడ్ వాడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీడిమెట్లలో పర్ఫెక్ట్ కిరాణా దుకాణాన్ని శ్రీనివాసరావు నడుపుతున్నారు.