ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-01T16:49:21+05:30 IST

ఏపీ అటవీశాఖ అధికారి వి.భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు.

ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

హైదరాబాద్: ఏపీ అటవీశాఖ అధికారి వి.భాస్కర రమణమూర్తి ఆత్మహత్య(57) చేసుకున్నారు. నాగోల్‌లోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన నివాసంలో రెండవ అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. డ్యూటీలో ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకి పాల్పపడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  రమణమూర్తి 1987 బ్యాచ్ కి చెందిన ఐ ఎఫ్ ఎస్ ఆదికారి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-10-01T16:49:21+05:30 IST