ఎంపీటీసీలకు 50,064 జడ్పీటీసీలకు 4,778 నామినేషన్లు

ABN , First Publish Date - 2020-03-13T09:04:06+05:30 IST

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. 13 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్న 652 జడ్పీటీసీలకుగాను 4,778 నామినేషన్లు...

ఎంపీటీసీలకు 50,064 జడ్పీటీసీలకు 4,778 నామినేషన్లు

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. 13 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్న 652 జడ్పీటీసీలకుగాను 4,778 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే 4,355 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీలకు సంబంధించి రాష్ట్రలోని 9696 స్థానాలకుగాను 50,064 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఈ నామినేషన్లను అధికారులు పరిశీలించారు. పోటీ నుంచి విరమించుకోవాలనే అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు  నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తారు. 


జడ్పీటీసీ నామినేషన్లు

జిల్లా            మొత్తం   దాఖలైన

         స్థానాలు   నామినేషన్లు

శ్రీకాకుళం     38 281

విజయనగరం     34 241

విశాఖపట్నం     39 296

తూర్పుగోదావరి    61 482

పశ్చిమగోదావరి   48 370

కృష్ణా             46 331

గుంటూరు     54 388

ప్రకాశం             55 394

నెల్లూరు            46 330

కర్నూలు          53 351

అనంతపురం      63 474

చిత్తూరు 65 480

కడప 50 341

Updated Date - 2020-03-13T09:04:06+05:30 IST