హోంగార్డులకు హౌసింగ్‌ పథకం!: డీజీపీ

ABN , First Publish Date - 2020-12-07T08:44:42+05:30 IST

పోలీసులతో కలిసి శాంతి భద్రతల నిర్వహణలో పాలుపంచుకునే హోంగార్డులు సేవా దృక్పథంతో సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కొనియాడారు.

హోంగార్డులకు హౌసింగ్‌ పథకం!: డీజీపీ

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పోలీసులతో కలిసి శాంతి భద్రతల నిర్వహణలో పాలుపంచుకునే హోంగార్డులు సేవా దృక్పథంతో సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కొనియాడారు. రాష్ట్ర హోంగార్డుల 58వ దినోత్సవం సందర్భంగా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. హోంగార్డుల వేతనాలు రూ.21, 300కు పెంచామని, ఆరోగ్య సంరక్షణతోపాటు, ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.30 లక్షల బీమా అందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అందరికీ హౌసింగ్‌ పథకం కింద అర్హులకు ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ తరహాలో పోలీసు రిక్రూట్‌మెంట్‌లో హోం గార్డులకు వయో సడలింపు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వానికి ఏపీ  హోంగార్డుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. హోం మంత్రి మేకతోటి సుచరితతో రాష్ట్ర అధ్యక్షుడు సత్తుపాటి గోవింద్‌ బృందం ఆదివారం భేటీ అయింది. రాష్ట్రంలోని 16 వేల మంది హోంగార్డుల సమస్యలు వివరిస్తూ యూనిఫామ్‌ అలవెన్స్‌ రూ.3వేలకు పెంచాలని కోరింది. 

Updated Date - 2020-12-07T08:44:42+05:30 IST