పండుగలా ఇళ్ల పంపిణీ: జగన్‌

ABN , First Publish Date - 2020-12-28T19:08:33+05:30 IST

జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. శ్రీ కాళహస్తి మండలంలోని ఊరందూరులో..

పండుగలా ఇళ్ల పంపిణీ:  జగన్‌

చిత్తూరు:  రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ పండుగలా జరుగుతోందని  సీఎం జగన్ వ్యాఖ్యానించారు.   సోమవారం శ్రీ కాళహస్తి మండలంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చిత్తూరులో 2.5 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేసినట్లు తెలిపారు.సొంతిల్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందన్నారు.  జిల్లాలో 1,78,840 ఇళ్లు కట్టబోతున్నామని ప్రకటించారు.  ఊరందూరులోనే 6,732 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఇక్కడ ఒక్క ప్లాట్ విలువ రూ.7 లక్షలు ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-28T19:08:33+05:30 IST