శాంతిభద్రతల విఘాతానికి కుట్ర

ABN , First Publish Date - 2020-03-12T10:36:54+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రశాతంగా ఎన్నికలు జరుగుతుంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని హోం మంత్రి మేకతో

శాంతిభద్రతల విఘాతానికి కుట్ర

  • మాచర్ల ఘటనలో ముగ్గురు అరెస్టు: సుచరిత 

గుంటూరు, మార్చి 11: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రశాతంగా ఎన్నికలు  జరుగుతుంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. గుంటూరులో బుధవారం రా త్రి మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం, డబ్బు లేకుండా ఎన్నిక లు జరగబోతున్నాయని అన్నారు. పోలీసులకు సమాచారం లేకుండా టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నలు మాచర్లకు వచ్చారన్నారు. గుంటూరులో టీడీపీ నేతలున్నప్పటికీ విజయవాడ నుంచి నేతలను పంపి కుట్రలు చేయాలని చూశారని ధ్వజమెత్తారు. మాచర్ల ఘటనలో తురక కిషోర్‌, గోపి, నాగరాజులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. 

Updated Date - 2020-03-12T10:36:54+05:30 IST