-
-
Home » Andhra Pradesh » Holidays for TTD employees
-
టీటీడీ ఉద్యోగులకు సెలవులు
ABN , First Publish Date - 2020-03-23T19:24:40+05:30 IST
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు అధికారులు సెలవులు ప్రకటించారు.

తిరుమల: కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు అధికారులు సెలవులు ప్రకటించారు. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న ఉద్యోగులు వచ్చేవారం విధులకు వచ్చేలా ఆదేశాలిచ్చారు. కొంతమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌కు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 4 వరకు వర్తిస్తాయని టీటీడీ అధికారులు జీవో జారీ చేశారు.